అమెరికా అధ్యక్ష ఎన్నికలో ట్రంప్ నామిని గురించి నిక్కిహేలి ఆసక్తికర వ్యాఖ్యలు

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు.  భారత సంతతికి చెందిన మహిళా నేత, సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ. నెల క్రితం వరకు అంతంత మాత్రంగా ప్రచారం సాగించిన ఆమె.. ఇటీవల జరిగిన రిపబ్లికన్ పార్టీ తొలి ప్రైమరీతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చారు. ఈ చర్చా కార్యక్రమంలో తన ప్రత్యర్ధి, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామితో నిక్కీ హేలీ హోరా హోరీగా తలబడ్డారు. ఆ మరుసటి రోజు నుంచే ఆమె పోల్ సర్వేల్లోనూ, విరాళాల సేకరణలోనూ ముందంజలో నిలిచారు.

 ఈ క్రమంలో నిక్కీ హేలీ మీడియాతో మాట్లాడుతూ.మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా వుండరని జోస్యం చెప్పారు.ప్రముఖ వార్తా సంస్ధ ది వాల్ స్ట్రీట్ జర్నల్ విడుదల చేసిన తాజా ఒపీనియన్ పోల్‌లో ట్రంప్, రాన్ డిసాంటిస్ తర్వాత పాపులారిటీ రేటింగ్ పరంగా హేలీ మూడో స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ లిస్ట్‌లో వివేక్ రామస్వామి నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిక్కీ హేలీ మాట్లాడుతూ..ట్రంప్ నామినీ అవుతారని తాను అనుకోవడం లేదన్నారు.

జో బైడెన్, కమలా హారిస్ చేస్తున్న దానికంటే రిపబ్లికన్ పార్టీ మంచి చేస్తుందని నిక్కీ అన్నారు. అమెరికాలోని అన్ని ప్రధాన జాతీయ పోల్స్‌ను పర్యవేక్షించే రియల్ క్లియర్ పాలిటిక్స్ ప్రకారం.. ట్రంప్ 53.6 శాతం ప్రజా ఆమోదంతో అగ్రస్థానంలో ఉండగా.. డిసాంటిస్ 13 శాతం, రామస్వామి 7.1 శాతం, హేలీ 6 శాతంతో నిలిచారు. బైడెన్ ఓటు వేస్తే కమలా హారిస్ కి వేసినట్టేనని వ్యాఖ్యానించారు నిక్కీహేలీ. 

Read more RELATED
Recommended to you

Latest news