కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి కీలక వ్యాఖ్యలు…!

మోడరనా కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్ కోసం స్వచ్ఛందంగా పాల్గొన్న నార్త్ కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన ఒక విద్యార్థి కీలక వ్యాఖ్యలు చేసాడు. కరోనా వైరస్ వ్యాక్సిన్ షాట్ పొందిన తర్వాత తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఫాక్స్ న్యూస్‌ తో మాట్లాడుతూ… జాక్ మార్నింగ్‌ స్టార్ అనే విద్యార్ధి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. మొదటి ఇంజెక్షన్ తర్వాత నేను కొన్ని దుష్ప్రభావాలను అనుభవించాను అని పేర్కొన్నాడు.

నేను కొంచెం అలసటతో ఉన్నానని చెప్పాడు. తీసుకున్న మరుసటి రోజు నాకు జ్వరం వచ్చింది అని చెప్పాడు. కాని నేను అన్ని పనులు చేసుకున్నాను. ఇంజెక్షన్ చేసిన చోట కొంచెం నొప్పిగా ఉంది. అయితే అతనికి జ్వరం రావడంతో రెండు సార్లు కరోనా టెస్ట్ చేయగా నెగటివ్ అని వచ్చింది. అయితే వైద్యులు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు.