అసలే ఏజెన్సీ ప్రాంతం సింగిల్ డిజిట్ టెంపరేచర్. చలి గజ గజా వణికిస్తోంది. ఇది విశాఖలోని అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పాడేరులో ఓ వ్యక్తి పీపీఈ కిట్ తో రోడ్డెక్కి జనాల గుండెల్లో గుబులు రేపాడు. అంతే కాదు ఆ కిట్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చి తాపీగా హోటల్కు వెళ్లి టీ తాగడం కలకలం రేపింది. అయితే ఇది చూసి అక్కడ ఉన్న వారికి టెన్షన్ పట్టుకుంది.
ఇదేంటి కోవిడ్ పేషెంట్ ఇలా రోడ్డు మీదకు వచ్చాడు అని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. స్థానికంగా అడుక్కునే ఒక వ్యక్తి చలికి భరించలేక ఆస్పత్రి బయట పడేసిన పీపీఈ కిట్ ఏరుకొచ్చి తొడుక్కున్నాడట. ఈ విషయం తెలుసుకొని జనాలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలా వాడి పాడేసిన పీపీఈ కిట్ లతో కూడా ప్రమాదం ఉండడంతో అతని చేత దానిని తీయించి పారేయించారు. అతనికి స్థానిక ప్రజాప్రతినిధి స్వెట్టర్ కొనిస్తానని హామీ ఇచ్చాడట.