మా దేశానికి వ్యాక్సిన్ వద్దు, నేను వ్యాక్సిన్ వేసుకొను: దేశాధ్యక్షుడి ప్రకటన

Join Our Community
follow manalokam on social media

తాను ఎలాంటి పరిస్థితిలో కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకోనని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో సంచలన ప్రకటన చేసారు. గురువారం పలు సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ లపై లైవ్ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేసారు. బ్రెజిలియన్లు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఆయనకు జులైలో కరోనా సోకింది. అమెరికా తర్వాత ఆ దేశంలోనే అత్యధిక కరోనా మరణాలు ఉన్నాయి.Brazil President Jair Bolsonaro will get tested for coronavirus again

“నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను, నేను దానిని తీసుకోను. ఇది నా హక్కు” అని ఆయన పేర్కొన్నారు. మాస్క్ ధరించడం వలన కరోనా తగ్గుతుంది అనే నమ్మకం లేదని, అసలు స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవని ఆయన అన్నారు. కరోనావైరస్ వ్యాక్సిన్ విస్తృతంగా ఉన్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. తన కుక్కకు మాత్రమే టీకాలు అవసరమని అక్టోబర్‌ లో ఆయన తన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసారు.

TOP STORIES

10వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. వెంట‌నే అప్లై చేయండి..!

తెలంగాణ స‌ర్కిల్‌లో గ్రామీణ్ డాక్ సేవ‌క్స్ (జీడీఎస్) పోస్టుల భ‌ర్తీకి గాను ఇండియా పోస్ట్ ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే...