నేపాల్ లో భారతీయుల కోసం ప్రముఖ సేవలు ప్రారంభం

-

నేపాల్ లో భారత్ కి చెందిన యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్  సేవలు అందుబాటులోకి వచ్చినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా  తాజాగా ప్రకటించింది. నేపాల్ వ్యాపారుల వద్ద ఇకపై క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి యూపీఐ వినియోగదారులు చెల్లింపులు చేయొచ్చని తెలిపింది.

గతేడాది సెప్టెంబరులో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ , నేపాల్ అతిపెద్ద చెల్లింపు నెట్వర్క్ ఫోన్ పే పేమెంట్ సర్వీస్ ల మధ్య భాగస్వామ్యం కుదరగా.. తాజాగా ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మెదటి దశలో యూపీఐ ఆధారిత యాప్  ద్వారా భారత వినియోగదారులు నేపాల్లోని వ్యాపార కేంద్రాల వద్ద యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఫోన్ పే నెట్ వర్క్  ఉన్న వ్యాపారులకు భారత వినియోగదారులు యూపీఐ ద్వారా చెల్లించవచ్చు.

ఇరు దేశాల పౌరుల మధ్య లావాదేవీల్లో ఈ సేవలు విప్లవాత్మక మార్పులు తెస్తాయని ఎన్ ఐపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రితేశ్ శుక్లా పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో రెండు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని, డిజిటల్ చెల్లింపుల్లో మార్పునకు కట్టుబడి ఉన్నామని అన్నారు. భారత్, నేపాల్ మధ్య ఆర్థిక సంబంధాలు, వాణిజ్య, పర్యాటకం గణనీయంగా మెరుగుపడటానికి యూపీఐ సేవలు ఉపకరిస్తాయని ఫోన్పే చీఫ్ ఎగ్జిక్యూటివ్ దివాస్ కుమార్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news