మల్కాజిగిరి బరిలో కొత్త వారి కోసం కేసీఆర్ అన్వేషణ.. మల్క కొమురయ్యకు చాన్స్..

-

మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి కొత్తవారిని బరిలోకి దింపేందుకు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ భావిస్తున్నారు.. నిన్న మొన్నటి వరకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఈ స్థానం నుంచి బరిలో ఉంటారని పార్టీ చెబుతూ వచ్చింది.. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి కుటుంబం వెనకడుగు వేసింది.. దీంతో బి.ఆర్.ఎస్ అధినేత కేసిఆర్ కొత్త వ్యక్తులను ఈ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారట. ఇదే సమయంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి విద్యాసంస్థల అధినేత మల్కా కొమురయ్యతో బిఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని ప్రచారం జోరు అందుకుంది..

Komaraiah Malka

బిజెపి నుంచి మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి కొమురయ్య బరిలోకి దిగుతారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా మాజీ మంత్రి ఈటల రాజేంద్ర కు టిక్కెట్ వరించడంతో.. కొమురయ్యను పార్టీలోకి తీసుకొని ఆయనకు టిక్కెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట.. బిజెపి ఇచ్చిన షాక్ lo కొమురయ్యను టిఆర్ఎస్ నేతలు టికెట్ ఆఫర్ చేశారని మల్కాజ్గిరి నియోజకవర్గం లో టాక్ నడుస్తుంది.. కొమురయ్యను ఒప్పించి పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను పార్టీ అధిష్టానం మల్లారెడ్డికి అప్పగించిందట. మల్లారెడ్డి తో పాటు ఓ మాజీ మంత్రి కొమరయ్యతో చర్చలు జరిపారని.. పార్టీలోకి తీసుకున్న వెంటనే మల్కాజ్గిరి టిక్కెట్ను కొమురయ్యకు అనౌన్స్ చేసే విధంగా ఆ ఇద్దరు నేతలు కొమురయ్యతో చర్చించారట.. దీనిపై కొమురయ్య ఆలోచనలో పడ్డారని.. త్వరలోనే ఆయన బిఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

మల్లారెడ్డి తరహాలోనే కొమురయ్యకు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలు ఉన్నాయి. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఆయనకు బందు వర్గం ఉంది.. దానికి తోడు ఆయన విద్యాసంస్థలో పనిచేసే వారు వేలమంది ఆ పరిసర ప్రాంతాల్లోనే నివాసాలు ఉంటున్నారట.. వీటన్నిటినీ బేరీజు వేసుకున్న కేసీఆర్.. కొమురయ్య అయితే ప్రత్యర్థులను సమర్థవంతంగా ఢీకొట్టగలరని భావించారట. అందుకోసమే ఆయనతో సంప్రదింపులు జరిపి.. పార్టీలోకి తీసుకొని టిక్కెట్ ఆఫర్ చేయాలని బిఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news