రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి బాధ్యతలు చేపట్టిన పుతిన్‌

-

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమర్‌ పుతిన్‌ వరుసగా ఐదోసారి బాధ్యతలు స్వీకరించారు. ఆ దేశ అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.  జాతీయ పార్లమెంట్‌కు చెందిన చ‌ట్టస‌భ ప్రతినిధులు, న్యాయ‌మూర్తులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో పుతిన్‌ రికార్డు స్థాయిలో 87.8 శాతం ఓట్లు పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పుతిన్‌ 2030 వరకు అధ్యక్షుడిగా కొనసాగితే 30 ఏళ్ల పాటు రష్యాను పాలించిన నాయకుడిగా రికార్డును సృష్టించనున్నారు. గతంలో జోసఫ్‌ స్టాలిన్‌ 29 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా కొనసాగారు. కమ్యూనిజం విప్లవం రాకముందు రాణి కేథరిన్‌ ది గ్రేట్‌ 34 ఏళ్ల పాటు రష్యాను పాలించారు. ఇక 2018లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యాను టాప్‌-5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా చేస్తానని పుతిన్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో పోరు, పశ్చిమ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలతో మాస్కో ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో రానున్న ఆరేళ్లల్లో పుతిన్‌ ఏమి చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news