కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పై కేసు నమోదు

-

కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కు ఊహించని షాక్‌ తగిలింది. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పై కేసు నమోదు అయింది. నిర్మల్ పీఎస్ లో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పై కేసు నమోదు అయింది. ఈ నెల 5న రాహుల్ గాంధీ సభలో రాముని పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దయాకర్.

ఈ తరుణంలోనే… కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే… బీజేపీ పార్టీ నేతల ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 504, 505/2 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రాముడు బీజేపీ వాళ్లకు ఏమైనా బంధువా….అసలు రాముడి ఏం చేశాడో తెలుసా అంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news