ఈజిప్టులో కాప్-27 సదస్సు.. సమావేశం నుంచి సడెన్​గా బయటకెళ్లిన రిషి సునాక్

-

ఈజిప్టు వేదికగా జరుగుతున్న వాతావరణ సదస్సు ‘కాప్‌ -27’ జరుగుతోంది. ఈ సదస్సుకు హాజరైన బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఏం జరిగిందా? అని అక్కడున్న సభ్యులంతా గందరగోళానికి గురయ్యారు. సమావేశ గది నుంచి రిషి హడావుడిగా బయటికెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

యూకేకు చెందిన కార్బన్‌ బ్రీఫ్‌ అనే మీడియా వెబ్‌సైట్‌ డైరెక్టర్‌ లియో హికమన్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో షేర్‌ చేశారు. ‘‘కాప్‌-27 సదస్సులో బాగంగా అడవుల పరిరక్షణ భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా.. రిషి సునాక్‌ మధ్యలోనే వెళ్లిపోయారు’’ అని హికమన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘బ్రిటన్‌ ప్రధాని వేదికపై కూర్చుని ఉండగా.. ఆయన సిబ్బంది ఒకరు వచ్చి సునాక్‌ చెవిలో ఏదో చెప్పారు. దాని గురించి వారిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. అప్పటికీ రిషి అలాగే కూర్చుని ఉన్నారు.

కొద్దిసేపటికి మరో సిబ్బంది వచ్చి రిషిని అక్కడి నుంచి వెళ్లిపోదామని కోరారు. ఇది జరిగిన రెండు నిమిషాలకే రిషి వేదికపై నుంచి దిగి తన సిబ్బందితో కలిసి హడావుడిగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే రిషి చెవిలో సిబ్బంది ఏం చెప్పారు? ఆయన అంత హడావుడిగా ఎందుకు వెళ్లిపోయారు?’’ అని హికమన్ మరో ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news