ఐదోసారీ పుతిన్​దే రష్యా పీఠం.. రష్యన్ల మద్దతు ఆయనకే అంటున్న సర్వేలు

-

వచ్చే ఏడాది రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి వ్లాదిమిర్ పుతిన్​కే పట్టం కట్టాలని రష్యా ప్రజలు భావిస్తున్నారట. పుతిన్​కే భారీ మద్దతు లభిస్తోందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధం వల్ల పుతిన్‌కు రష్యన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోందని తెలిపాయి. ఒకదశలో ఆయనకు 80 శాతానికిపైగా రష్యన్ల మద్దతు లభించిందని వెల్లడించాయి.

పుతిన్‌ విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రష్యాను 24 ఏళ్లుగా పుతిన్‌ పరిపాలిస్తున్న విషయం తెలిసిందే. అయితే అయిదోసారి కూడా ఆయన విజయం ఖాయమని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను 73 శాతం రష్యన్లు సమర్థిస్తున్నట్లు సెప్టెంబరులో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైనప్పుడు పుతిన్‌కు 68 శాతం ఉన్నమద్దతు.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యా చెబుతున్న కారణాలను అత్యధిక రష్యన్లు విశ్వసిస్తున్నారని ఈ సర్వేలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే పుతిన్​కు మద్దతిస్తున్నట్లు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news