బంకర్​లోకి పుతిన్.. జెలెన్​స్కీని చంపేందుకు కుట్ర..!

-

రష్యా రాజధాని మాస్కోలోని క్రెమ్లిన్‌ భవనాలపైకి ఇటీవల రెండు డ్రోన్లు దూసుకురావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ రష్యా వెంటనే అప్రమత్తమైంది. దీనికి ప్రతీకార చర్యగా ఉక్రెయిన్​లోని ఖేర్సన్​పై విరుచుకుపడింది. సామాన్య పౌరుల ప్రాణాలను బలి తీసుకుంది. క్రెమ్లిన్​ పై దాడికి అమెరికాయే కారణమంటూ రష్యా తీవ్ర విమర్శలు చేసింది. ఎక్కడ దాడి చేయాలో ఆ లక్ష్యాలను అమెరికా ఎంపిక చేస్తే ఉక్రెయిన్‌ అమలు పరిచిందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ ఆరోపించారు.

క్రెమ్లిన్‌పై జరిగిన డ్రోన్‌ దాడిని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని చంపడం మినహా తమ దగ్గర మరో మార్గం లేదని కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రీ మెద్వదేవ్‌ వ్యాఖ్యానించారు. జెలెన్‌స్కీ బేషరతుగా లొంగిపోయే పత్రంపై సంతకం చేయాల్సిన అవసరం కూడా లేదని.. ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది అని మండిపడ్డారు. మరోవైపు భద్రతా సిబ్బంది పుతిన్‌ను బంకర్‌లోకి తరలించింది. నోవో-ఒగరెవో ప్రాంతంలోని నివాసంలో ఉన్న బంకర్‌ నుంచే పుతిన్ కార్యకలాపాలు నిర్వహిస్తారని రష్యన్‌ మీడియా వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news