చంద్రగ్రహణం రోజూ గర్భిణీలు ఆ తప్పులు అస్సలు చెయ్యకండి.. పుట్టబోయే బిడ్డపై ఎఫెక్ట్ పడుతుంది..

-

ఈరోజు చంద్రగ్రహణం.. ఈ ఏడాదిలో వచ్చే మొదటి గ్రహణం అని పండితులు చెబుతున్నారు..తొలి చంద్రగ్రహణం ఈరోజు రాత్రి 08:44 నిమిషాల సమయంలో ప్రారంభమవుతుంది. ఈసారి అరుదైన పెనుంబ్రల్ చంద్రగ్రహణం ఏర్పడనుందని చెబుతున్నారు.. మాములుగా భూమి చంద్రుడు మధ్య సూర్యుడు వచ్చినప్పుడు, చంద్రుని నీడ భూమి మీద పడదు.. అప్పుడే ఈ గ్రహణం ఏర్పడుతుంది.

నిజానికి.. చంద్ర గ్రహణాన్ని ఎవరైనా నేరుగా చూడొచ్చు. చంద్రగ్రహణాన్ని నేరుగా చూడటం వల్ల ఎలాంటి హానీ కలగదు…ఏదైనా గ్రహణాలు ఏర్పడినప్పుడు గ్రహణానికి ముందు ఉండే కాలాన్ని సూతక కాలం అంటారు. సహజంగా సూతక కాలాన్ని అశుభ కాలంగా పరిగణిస్తారు. సూతక కాలంలో కూడా కొన్ని పాటించాల్సిన నియమాలు ఉన్నాయి అని పెద్దలు చెబుతారు. ఇదిలా ఉంటే గ్రహాల కదలికలు, ఖగోళంలో సంభవించే మార్పులు, గ్రహణాలు మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి..

ఈ గ్రహణం ఎక్కువగా గర్భిణీ స్త్రీలపై చాలా దుష్ప్రభావాలను చూపించే అవకాశం ఉంటుందని పెద్దలు చెబుతారు. అందుకే గర్భిణీ మహిళలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు 08:44 నుండి గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఒకవేళ బాగా ఆకలి అనిపిస్తే పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. చంద్ర గ్రహణ సమయంలో ఎటువంటి పనులు చేయకూడదు. పదునైన వస్తువులను ముట్టుకోకూడదు.. అది చెడుకు సంకేతం.. అలాగే గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి. గ్రహణం పట్టిన సమయంలో మెటల్ వస్తువులకు దూరంగా ఉండాలి.

ఇక కూరగాయలు కట్ చేయడం వంటి పనులు అసలు చేయకూడదు. అంతేకాదు గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో స్నానం కూడా చేయకూడదు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఎటువంటి పని చెయ్యకూడదు.. గ్రహణం విడిచిన తర్వాత తప్పకుండా గర్భిణి స్త్రీలు స్నానం చేయాలి. ఇక ఈ నియమాలు పాటించడం వల్ల గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో వచ్చే దుష్ప్రభావాల నుంచి తమను, తమ బిడ్డలను కాపాడుకున్నవారవుతారు. ఇక ఈ నియమాలను గర్భిణీలు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు.. బిడ్డలపై ప్రభావం చూపదని నమ్మకం. ఇవి ఈరోజు తప్పకుండ పాటించండి..

Read more RELATED
Recommended to you

Latest news