మాస్కోపైకి ఉక్రెయిన్​ డ్రోన్లు.. తిప్పికొట్టిన రష్యా

-

రష్యా-ఉక్రెయిన్​ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నటి దాకా ఉక్రెయన్​పై భీకర యుద్ధం చేసి అక్కడి పలు నగరాలను తన అధీనంలోకి తెచ్చుకుంది రష్యా. అయితే కొన్నిరోజులుగా ఉక్రెయిన్​ కూడా రష్యాపై కౌంటర్ అటాక్స్ చేస్తోంది. ముఖ్యంగా మాస్కోను టార్గెట్ చేసుకుని అక్కడి భవనాలపై డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా మరోసారి ఉక్రెయిన్‌ మాస్కోవైపు రెండు డ్రోన్లను పంపగా.. రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు గురువారం వాటిని కూల్చివేశాయి.

వరసగా రెండోరోజు ఇలాంటి పరిణామం చోటు చేసుకుందని రష్యా అధికార వర్గాలు తెలిపాయి. డ్రోన్లతో చేస్తున్న దాడివల్ల సైనికపరంగా ఉక్రెయిన్‌ పెద్ద ప్రభావం చూపలేకపోయినా, రష్యాకు ఒక్క కుదుపునిచ్చి యుద్ధ ప్రభావం గురించి చవిచూపించడమే ఉద్దేశంగా భావిస్తున్నారు. తాము సురక్షితంగా ఉన్నట్లు మాస్కో ప్రజలు ఇంతకాలం భావిస్తున్నారని, రష్యాలో ప్రతి పౌరుడిపైనా యుద్ధ ప్రభావం ఉందని చాటడం దాడుల లక్ష్యమని ఉక్రెయిన్‌ వాయుసేన అధికారి ఒకరు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news