సౌదీ అరేబియా సంచలన నిర్ణయం.. ఒకే రోజు 81 మందికి మరణశిక్ష

-

సాధారణంగా ముస్లిం దేశాల్లో నేరాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయో మనందరికి తెలుసు. దొంగతనం నుంచి అత్యాచారాల వరకు అక్కడ నేరాలు పాల్పడితే.. తీవ్రమైన శిక్షలు విధిస్తుంటారు. బహిరంగంగా ఉరితీయడం, శిరచ్ఛేదనం, అవయవాలు తీసేయడం వంటివి చేస్తుంటారు. ముఖ్యంగా ఇరాన్, ఈజిప్ట్, ఇరాక్, సౌదీ, యూఏఈ, యెమెన్, సిరియా వంటి అరబ్ దేశాలో ఈ శిక్షలను చూస్తుంటాం.

తాజాగా సౌదీ అరేబియా ఓ సంచల నిర్ణయం తీసుకుంది. శనివారం ఒకే రోజు 81 మందికి మరణశిక్ష విధించింది. ఉరితీయబడ్డ 81 మందిలో 73 మంది సౌదీ పౌరులు, ఏడుగురు యెమెన్, ఒకరు సిరియా పౌరుడు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్-ఖైదా, యెమెన్ హుతీ తిరుగుబాటు దళాలు, ఇతర ఉగ్రవాద సంస్థల”తో సంబంధం ఉన్న దోషులు కూడా ఉన్నారని పేర్కొంది. దేశంలో దాడులకు పాల్పడటం, పౌరులను, భద్రతా బలగాలను హతమార్చేందుకు కుట్ర పన్నడం వంటి నేరారోపణలపై వీరందరిని ఉరి తీశారు. అపహరణ, చిత్రహింసలు, అత్యాచారం, దేశంలోకి ఆయుధాలు, బాంబులను అక్రమంగా రవాణా చేయడం వంటి నేరాలు ఈ నేరారోపణలలో ఉన్నాయి.

2021లో సౌదీలో 69 మందిని ఉరితీశారు. ఈ ఏడాది 2022 శనివారం 81 ఉరిశిక్షలతో పాటు.. అంతకు ముందు మరో 11 ఉరి శిక్షలను కలుపుకుంటే ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 92 మందికి ఉరిశిక్ష విధించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news