16 రకాల పురుగులు తినొచ్చు.. రెస్టారెంట్లకు సర్కార్ పర్మిషన్

-

16 రకాల పురుగులు తినొచ్చని ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో రెస్టారెంట్ల యజమానులు సంబురాల్లో మునిగిపోయారు. పురుగులు తినడమా? దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడమా? అసలు ఇదంతా ఏంటనుకుంటున్నారా? ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి మరి.

కీటకాలను ఆహారంలో భాగం చేసింది సింగపూర్ ప్రభుత్వం. మిడతలు, పట్టు పురుగులు, గొల్లభామ సహా మొత్తం 16 కీటకాలను ఆహారంగా వినియోగించుకునేందుకు సింగపూర్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చైనీస్, భారతీయ వంటకాలతో సహా ప్రపంచ ఆహార మెనూలో ఈ కీటకాల జాబితాను చేర్చింది. ప్రభుత్వ నిర్ణయం కీటకాలతో ఆహారం తయారుచేసే హోటల్స్, రెస్టారెంట్ యజమానులు ఆనందం వ్యక్తం చేశారు. చైనా, థాయ్ లాండ్, వియత్నాం నుంచి ఈ కీటకాలు సింగపూర్కు సరఫరా కానున్నాయి.

కీటకాల ఆహార ఉత్పత్తుల విషయంలో కూడా ఆహార భద్రత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. లేదంటే సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. పురుగులను మాంసానికి ప్రత్యామ్నాయ ఆహారంగా యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కొన్నాళ్ల క్రితం ప్రకటిస్తూ.. కీటకాల్లో అధిక ప్రొటీన్ ఉంటుందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news