కెన్యాలో అమానుషం.. పాస్టర్‌ మాటలు నమ్మి నిరాహార దీక్ష.. 201 మంది మృతి

-

కెన్యాలో ఘోరం జరిగింది. ఓ చర్చి పాస్టర్ నిర్వాకం వల్ల ఇప్పటి వరకు 200 మందికిపైగా ప్రాణాలు తీసుకున్నారు. గత నెల నుంచి అధికారులు కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం ఏకంగా 22 మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా ఆహారం తీసుకోకుండా ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. మరో 600 మంది జాడ తెలియడం లేదు.

2019లో పాల్‌ మెకంజీ అనే చర్చి పాస్టర్‌ ఈ అటవీ ప్రాతంలోని కిలిఫీ అనే చోట 800 ఎకరాల్లో విస్తరించిన ప్రాపర్టీలో మకాం వేశాడు. ఆహారం తినకుండా తీవ్రమైన ఆకలితో మరణిస్తే జీసెస్‌ను కలిసే అదృష్టం వస్తుందని తన అనుచరులకు ఉద్బోధించాడు. దీంతో అతడి అనుచరులు నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. దీంతో డజన్ల సంఖ్యలో భక్తులు ప్రాణాలు విడిచారు. వీరందరిని ఆ ప్రాపర్టీలోనే సామూహిక ఖననాలు చేశారు. ఈ విషయం తెలుసుకొన్న కెన్యా అధికారులు దాడులు చేసి గత నెల మెకంజీని అదుపులోకి తీసుకొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news