ఎట్టకేలకు నాటోలో చేరిన స్వీడన్

-

పశ్చిమ దేశాల సైనిక కూటమి (నాటో)లో స్వీడన్‌ అధికారికంగా చేరింది. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్‌సన్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లు ఒక కార్యక్రమంలో ఈ మేరకు అధికారిక పత్రాన్ని మార్చుకున్నారు. దీని వల్ల రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దశాబ్దాల పాటు కొనసాగించిన తటస్థ వైఖరికి స్వీడన్‌ వీడ్కోలు పలికినట్లయ్యింది. నాటోలో చేరిన 32వ సభ్యదేశంగా స్వీడన్ నిలిచింది.

2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి పరిణామాలతో ‘నాటో’లో చేరిక దిశగా స్వీడన్‌ ముందడుగు వేయగా తుర్కియే, హంగరీలు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తీవ్రవాదులుగా పరిగణించే కుర్దిష్ గ్రూపులకు స్వీడన్ ఆశ్రయం కల్పిస్తుంది అని టర్కీ ఆందోళ వ్యక్తం చేసింది. మరోవైపు హంగేరి అధ్యక్షుడు విక్టర్ ఓర్బన్ ఇప్పటి దాకా రష్యా అనుకూల భావాన్ని ప్రదర్శించారు.  ఈ సంవత్సరం ప్రారంభంలో స్వీడన్ ప్రవేశాన్ని టర్కీ ఆమోదించగా.. హంగేరి ఈ వారంలో ఆమోదించింది. దీంతో 32వ సభ్య దేశంగా స్వీడన్ ‘నాటో’లో చేరింది. ఇప్పటి నుంచి తమ దేశం సురక్షితంగా ఉంటుందని స్వీడన్ ప్రధాని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news