అమెరికా సహకారంతో సైన్యాన్ని చంపేస్తున్న ఉగ్రవాదులు…!

-

ఆఫ్ఘన్ లో శాంతి కోసం అమెరికా వేసిన రాజీ అడుగులు పెద్దగా ఫలించడం లేదు. ఆఫ్ఘన్ లో తాలీబాన్లు దాడులను ఆపడం లేదని తాజాగా వెల్లడైన ఒక నివేదిక వెల్లడించింది. అమెరికా నాలుగు నెలల క్రితం తాలీబాన్ల తో కీలక ఒప్పందం చేసుకుంది. శాంతి దిశగా అడుగులు వేద్దామని పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలోనే అమెరికా బలగాలను వదిలిపెట్టి తాలీబాన్లు ఆఫ్ఘన్ బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు.

దేశ వ్యాప్తంగా రెండు నెలల నుంచి ఆఫ్ఘాన్ బలగాల మీద రోజుకు 55 సార్లు దాడులు జరిగాయని ఈ దాడులో భారీగా ప్రాణ నష్టం జరిగిందని ఒక నివేదిక పేర్కొంది. అమెరికా సైనికుల మద్దతుతోనే ఈ దాడులకు తాలీబాన్ ఉగ్రవాదులు దిగినట్టు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం (సిగార్) కోసం అమెరికా నుంచి ఏ మాత్రం సహకారం లేదని తాజా నివేదిక స్పష్టం చేసింది. మార్చ్ లో గతం కంటే ఎక్కువ దాడులను తాలీబాన్లు చేసారు.

ఆఫ్ఘన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకారం, మార్చి 1 నుండి తాలిబాన్ రోజుకు సగటున 55 దాడులు చేసారని, ఈ దాడుల్లో భారీగా ప్రాణ నష్టం జరిగిందని వెల్లడించింది. “తాలిబాన్ శాంతి కోసం ఏమీ చేయలేదని మరియు ఆఫ్ఘన్లకు వ్యతిరేకంగా వారి ఉగ్రవాద ప్రచారాన్ని కొనసాగించడానికి ప్రతి మార్గాన్ని అనుసరిస్తున్నారని కౌన్సిల్ ప్రతినిధి జావిద్ ఫైసల్ ట్విట్టర్లో తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

ఆఫ్ఘనిస్తాన్లోని యుఎస్ కమాండర్ జనరల్ ఆస్టిన్ “స్కాట్” మిల్లెర్ మంగళవారం తాలిబాన్లకు దాడులను తగ్గించాలని, రాజకీయ సుస్థిరతను ఏర్పాటు చెయ్యాలని, అందుకోసం అన్ని మార్గాలను అనుసరించాలని సూచించారు అమెరికా సైనిక ప్రతినిధి స్కాట్ మిల్లర్. తాలిబాన్లు దాడి కొనసాగిస్తే, వారు ఆశించేది ఎదురు దాడికి సిద్దంగా ఉండాలని కూడా ఆయన హెచ్చరించారు. ఫిబ్రవరిలో జరిగిన ఒప్పందం ప్రకారం శాంతి చర్చలు జరగాలి. కాని దాడులు మాత్రం ఆగడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news