అమెరికాలో టిక్ టాక్ బ్యాన్ గడువు పెంపు…!

-

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ శనివారం ఒరాకిల్‌ తో తన యుఎస్ టెక్నాలజీ ప్రొవైడర్‌గా, వాల్‌మార్ట్‌తో వాణిజ్య భాగస్వామిగా ఒక ఒప్పందాన్ని ముందు పెట్టినట్టుగా ప్రకటన చేసింది. “టిక్‌టాక్, ఒరాకిల్ మరియు వాల్‌మార్ట్ ప్రతిపాదన ప్రకారం… యుఎస్ అడ్మినిస్ట్రేషన్ యొక్క భద్రతా అనుమానాలను పరిష్కరిస్తుందని, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తుందని టిక్ టాక్ యాజమాన్యం తెలిపింది.

ఒరాకిల్ “విశ్వసనీయ టెక్నాలజీ ప్రొవైడర్ అవుతుంది, ఇది అన్ని యుఎస్ యూజర్ డేటాను హోస్ట్ చేయడానికి మరియు యుఎస్ జాతీయ భద్రతా అవసరాలు పూర్తిగా సంతృప్తికరంగా ఉండేలా అనుబంధ కంప్యూటర్ వ్యవస్థలను భద్రపరచడానికి బాధ్యత వహిస్తుంది” అని టిక్ టాక్ పేర్కొంది. తమకు ఇప్పటికే వాల్ మార్ట్ తో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని టిక్ టాక్ పేర్కొంది. 25 వేల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని టిక్ టాక్ చెప్పింది. అయితే టిక్ టాక్ డౌన్లోడ్ నిషేధాన్ని ఈ నెల 27 వరకు పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news