విమానం గాల్లో ఉండగా ఊడిన టైరు.. వీడియో వైరల్‌

-

అమెరికాలోని ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా దాని టైరు ఊడిపడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పైలట్లు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ముప్పు తప్పింది. ప్రమాదాన్ని గమనించిన పైలట్లు వెంటనే దారిమళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అసలేం జరిగిందంటే?

యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 777-200 విమానం గురువారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్‌లోని ఒసాకాకు బయల్దేరింది. టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే వెనుక వైపున ల్యాండింగ్‌ గేర్‌లోని ఓ టైరు ఊడిపోయి ఎయిర్‌పోర్టులోని పార్కింగ్‌ లాట్‌లో ఉన్న కారుపై పడింది. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని దారి మళ్లించి లాస్‌ఏంజిల్స్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించేశారు. అది సురక్షితంగా ల్యాండ్‌ అయ్యిందని.. అందులోని ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపించామని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news