కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఘోరంగా విఫలం అయ్యారని, అమెరికా చరిత్రలోనే ఆయన వరస్ట్ అని ఆరోపించారు ఆ దేశ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్. ట్రంప్ పరిపాలనా లోపం కారణంగా 2,10,000 మందికి పైగా అమెరికన్లను కరోనాతో చంపేశారు అని ఆమె ఆరోపించారు. మైక్ పెన్స్ కి ఆమెకు మధ్య డిబేట్ జరిగింది.
ట్రంప్ కరోనా నిర్వహణను వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ సమర్థించగా, డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధి కమలా హారిస్ తప్పుపట్టారు. ఇదో గొప్ప పాలనా వైఫల్యం అని ఆమె ఆరోపించారు. ప్రజలు వినడానికి ఇష్టపడకపోవచ్చు, కాని వారు వినాలి, “ఈ పరిపాలన యొక్క అసమర్థత కారణంగా వారు చాలా ఎక్కువ త్యాగం చేయాల్సి వచ్చింది” అని కమలా హారిస్ ఆరోపించారు. అసలు కరోనా అంటే ట్రంప్ కి లెక్క లేదని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని ఆమె మండిపడ్డారు.