ఎలాన్ మస్క్​పై రిషి సునాక్ ఫైర్.. అది ముమ్మాటికీ తప్పేనంటూ..

-

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్​పై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఫైర్ అయ్యారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వేళ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఎక్స్ వేదికగా యూదు వ్యతిరేక పోస్టులు రావడం.. వాటిలో కొన్నింటికి మస్క్ మద్దతు పలకడాన్ని రిషి సునాక్ తప్పుబట్టారు. మస్క్ ప్రవర్తన ముమ్మాటికీ తప్పేనని తేల్చి చెప్పారు. యూదు వ్యతిరేకత ఏ రూపంలో ఉన్నా.. అది పూర్తిగా తప్పని వ్యాఖ్యానించారు. దాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రిషి స్పష్టం చేశారు.

‘‘నేను చాలా మందితో చర్చలు జరుపుతాను. అయితే వారి వ్యక్తిగత అభిప్రాయాలపై నేను దృష్టి సారించాలనుకోవడం లేదు. వాస్తవానికి నేను యూదు వ్యతిరేకతను అసహ్యించుకుంటాను. ఇతరులను దుర్భాషలాడటం తప్పే. యూదు వ్యతిరేకత ఏ రూపంలో ఉన్నా సరే అది పూర్తిగా తప్పు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను’’ అని రిషి సునాక్ వెల్లడించారు.

ఇటీవలే.. యూదులు, శ్వేతజాతీయులను కించపర్చేలా ఓ యూజర్‌ పెట్టిన పోస్ట్‌పై మస్క్‌ స్పందిస్తూ సరిగ్గా చెప్పారంటూ మద్దతు పలికారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. యాపిల్, డిస్నీ వంటి సంస్థల అధిపతులు మస్క్​ వ్యవహార శైలిని తప్పు పడుతూ వారి యాడ్స్​ను ఎక్స్​లో నిలిపివేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news