ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు తప్ప.. అభివృద్ధి జరగలేదు : కేసీఆర్

-

ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని.. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు తప్ప.. ప్రగతి ఏం జరగలేదని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇందిరమ్మ పాలన బాగుంటే ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి.. రూ.2కే కిలో బియ్యం ఎందుకిచ్చారని ప్రశ్నించారు. పదేళ్ల క్రితం తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్ల ఉందో గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల పర్యటనలో భాగంగా ఇవాళ షాద్​నగర్​లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.

“కంటి వెలుగు కార్యక్రమం ఉంటుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. రాష్ట్రంలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశాం. 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన‌్యం కొంటున్నాం. రైతుబంధు అనే మాట పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రైతుబంధు ఇచ్చి ప్రజల డబ్బు వృథా చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మమ్మల్ని గెలిపిస్తే.. రైతుబంధు ఉంచడమే కాదు.. రూ.16 వేలకు పెంచుతాం. రైతులకు 24 గంటల కరెంట్‌ అవసరం లేదు.. 3 గంటలు చాలని రేవంత్‌రెడ్డి అంటున్నారు. మేం తెచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల రైతుల భూములు నిశ్చింతగా ఉన్నాయి. రైతుల వేలిముద్ర లేకుండా భూరికార్డులను సీఎం కూడా మార్చలేరు.” అని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

Read more RELATED
Recommended to you

Latest news