అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం 2021కు నామినేట్ అయ్యారు. ట్రంప్ పేరును నార్వేజియన్ పార్లమెంట్ సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ జెజెడ్డే ప్రతిపాదించారు. ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చినందుకుగానూ ఆయన పేరును నామినేట్ చేస్తున్నట్టు క్రిస్టియన్ టైబ్రింగ్ జెజెడ్డే పేర్కొన్నారు. ఇదేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యల పరిష్కారానికి ట్రంప్ ఎంతగానో కృషి చేశారని.. ట్రంప్‌ను ప్రశంసించారు క్రిస్టియన్ టైబ్రింగ్ జెజెడ్డే.
అయితే, నవంబర్‌లో అమెరికాలో ఎన్నికలు జరుగనున్న వేళ ట్రంప్ పేరు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కావడం గమనార్హం. కాగా, 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నోబెల్ శాంతి బహుమతి లభించింది.