ఇజ్రాయెల్‌పై దాడి ఎఫెక్ట్.. ఇరాన్‌పై అమెరికా, బ్రిటన్‌ ఆంక్షలు

-

సిరియాలో ఉన్న తమ​ కాన్సులేట్‌ భవనం ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్‌ చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడింది. ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ పేరుతో వంద కన్నా ఎక్కువ డ్రోన్లు, మిస్సైళ్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. అయితే అప్పటికే సిద్ధంగా ఉన్న ఇజ్రాయెల్ ఈ డ్రోన్లు, మిసైళ్లను సమర్థంగా తిప్పికొట్టింది. అంతే కాకుండా ఆపరేషన్ ఐరన్ షీల్డ్ పేరుతో ఇరాన్ పై ప్రతీకార దాడి తప్పక ఉంటుందని ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.

అయితే ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన ఇరాన్‌కు మరో షాక్ తగిలింది. ఇరాన్ పై గురువారం రోజున అమెరికా, బ్రిటన్‌ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. టెహ్రాన్‌ డ్రోన్‌, క్షిపణి సాంకేతికతను పరిమితం చేసే దిశగా ఈ ఆంక్షలను విధించాయి. డ్రోన్లకు ఇంజిన్లు తయారు చేసే 16 మంది వ్యక్తులను, రెండు సంస్థలను అమెరికా ఆర్థికశాఖలోని విదేశీ ఆస్తుల నియంత్రణ విభాగం ఆంక్షల పరిధిలోకి తీసుకురాగా.. బ్రిటన్‌ కూడా డ్రోన్‌, బాలిస్టిక్‌ క్షిపణులు తయారు చేసే సంస్థలు, వ్యక్తులనే లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news