ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వేళ.. రష్యాపై అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు

-

ఇజ్రాయెల్-హమాస్​ల మధ్య యుద్ధం ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తోంది. ఈ ఇరు దేశాలకు మద్దతు ప్రకటిస్తున్న దేశాలు కూడా ఇక్కడి పరిస్థితులను చూసి ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ యుద్ధంలో పిట్టల్లా రాలిపోతున్న ఎంతో మంది చిన్నారులను చూసి ప్రపంచం గుండె తరుక్కుపోతోంది. ఈ క్రమంలో ఇటీవల ఇజ్రాయెల్​లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యటించారు. ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో సమావేశమై.. మద్దతు ప్రకటిస్తూనే.. మరోవైపు గాజాకు మానవతా దృక్పథంతో ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఈ ఇరు దేశాల యుద్ధం సమయంలో బైడెన్ రష్యాపై కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్, రష్యా రెండూ ఒకటేనని వ్యాఖ్యానించారు. తమ దేశాలను కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌, ఉక్రెయిన్‌కు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని మరోసారి స్పష్టం చేశారు బైడెన్. గురువారం రాత్రి ప్రజలనుద్దేశిస్తూ ప్రసంగించిన బైడెన్.. హమాస్‌, రష్యాపై విరుచుకుపడ్డారు. హమాస్‌, రష్యా వేర్వేరు విధాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నా.. పొరుగున ఉన్న ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేయడమనే ఒకే లక్ష్యాన్ని కలిగి ఉన్నారని విరుచుకుపడ్డారు. ఇలాంటి దేశాల దురాక్రమణలు కొనసాగేందుకు అనుమతిస్తే.. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఆ ఘర్షణలు వ్యాపిస్తాయని.. అందుకే తాము బాధిత దేశాలకు మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news