అధ్యక్ష రేసులో బైడెన్, ట్రంప్ హవా.. మరో 4 రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో విజయం

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓవైపు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మరోవైపు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తమ జోరు సాగిస్తున్నారు. నువ్వా నేనా అంటూ మరోసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. తమ పార్టీల నుంచి అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. తాజాగా మంగళవారం జరిగిన ఇల్లినాయీస్, ఫ్లోరిడా, ఒహైయో, కాన్సాస్ రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ విజయం సాధించారు. 2020లో తాను ట్రంప్ను ఓడించడానికి లాటినో ఓటర్లే కారణమని జో బైడెన్ అన్నారు. 2020లో లాగా మళ్లీ ట్రంప్ను ఓడించడానికి సాయం చేయాలని లాటినో ప్రజలను కోరారు.

ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలపై కొన్ని నెలల ముందు నుంచే ట్రంప్, బైడెన్ దృష్టి సారించారు. పలు రాష్ట్రాల్లో ర్యాలీలు, ప్రచారాలు నిర్వహిస్తూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు ప్రతి ప్రచారంలో తమ వయస్సుపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version