వ్యాక్సిన్ ల వల్లే క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గింది – డబ్యూహెచ్‌వో

ప్ర‌పంచ వ్యాప్తం గా డెల్టా వైర‌స్ వ్యాప్తి త‌గ్గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వ్యాక్సిన్ లే అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వ్యాక్సిన్ లు అందుబాటు లో లేకుంటే డెల్టా వేరియంట్ వ్యాప్తి ని నిరోధించ‌డం క‌ష్ట మేన‌ని అని అభిప్రాయ ప‌డింది. ప్ర‌తి ఒక్క‌రు వ్యాక్సిన్ ల ను తీసుకోవాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కోరింది. కరోనా వైర‌స్ ఇత‌ర వేరియంట్ ల‌ను కూడా వ్యాక్సిన్ లు స‌మ‌ర్థ వంతంగా అడ్డుకుంటున్నాయ‌ని తెలిపారు.

డెల్టా వేరియంట్ ను వ్యాక్సిన్ లు దాదాపు 60 శాతానికి మించి అడ్డుకుంటున్నాయ‌ని తెలిపారు. మ‌రి కొన్ని వ్యాక్సిన్ లు ఇంకా స‌మ‌ర్థ వంతం గా కరోనా వైర‌స్ ల వేరియంట్ ల‌ను ఎదుర్కో వ‌డం లో స‌ఫ‌లం అవుతున్నాయ‌ని డ‌బ్యూ హెచ్‌వో తెలిపింది. అలాగే క‌రోనా మ‌ర‌ణాలు గ‌ణ‌నీయం గా త‌గ్గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కూడా వ్యాక్సిన్ లే అని డ‌బ్యూ హెచ్‌వో స్ప‌ష్టం చేసింది. అలాగే వ్యాక్సిన్ లు తీసుకున్న వారు కూడా క‌రోనా జాగ్ర‌త్త లు త‌ప్ప‌కుండా పాటించాల‌ని సూచించింది.