డ్రాగన్​పై ఆధారపడొద్దంటూ.. మరోసారి చైనా ప్రస్తావన తెచ్చిన వివేక్ రామస్వామి

-

చైనా నుంచి అమెరికా ఆర్థిక స్వాతంత్య్రం ప్రకటించుకోవాలని రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి అన్నారు. యూఎస్ ఆధునిక జీవన విధానమంతా చైనాపై ఆధారపడి ఉండటంవల్ల ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలోని మయామీలో బుధవారం రోజున జరిగిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థుల మూడో చర్చా వేదికలో రామస్వామి మాట్లాడుతూ చైనా-అమెరికా సంబంధాలు.. చైనాతో బంధం వల్ల అమెరికాకు జరుగుతున్న నష్టం గురించి వివేక్ రామస్వామి తన అభిప్రాయాలు పంచుకున్నారు.

చైనా సరఫరా వ్యవస్థపై అమెరికాలోని కీలక రక్షణ పారిశ్రామిక రంగం ఆధారపడి ఉందని.. ఇలాగైతే చైనా కంటే యూఎస్ స్ట్రాంగ్ కాలేదని వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు. ఔషధాలు, సెమీకండక్టర్ల కోసం ఆ దేశంపై ఆధారపడుతున్నామని అన్నారు. అమెరికాకు స్వతంత్రంగా వ్యవహరించే రాజకీయ నాయకులు కావాలంటే.. ఇలా ఆధారపడేలా చేసే చైనాలాంటి శక్తులను అడ్డుకోవాలని చెప్పారు. యూఎస్​లో చైనా కావాల్సినంతగా భూములను కొన్నదని.. కానీ తమ విశ్వవిద్యాలయాలకు డొనేషన్లు ఇవ్వరని.. ఈ విధానాలను మార్చుకునేంత వరకూ చైనా మార్కెట్లో అమెరికా వ్యాపారాలను విస్తరించబోమని డ్రాగన్ దేశానికి వివేక్ రామస్వామి సందేశమిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news