ఉక్రెయిన్‌పై వివేక్‌ రామస్వామి కీలక వ్యాఖ్యలు

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ పడుతున్న వివేక్ రామస్వామి తన ప్రసంగాలతో ఓటర్ల మనసు గెలుచుకుంటున్నారు. ఇక తాను కనుగ అధ్యక్షుడినైతే ఆ దేశంలో ఎలాంటి కీలక మార్పులు తీసుకువస్తానో అనే విషయాలను వివేక్.. అక్కడి ఓటర్లకు స్పష్టంగా వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఉక్రెయిన్​కు సాయం అందించే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే….ఉక్రెయిన్‌కు అందిస్తున్న సాయంలో కోత విధించనున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లో సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు మరింత సాయం అందించాలన్న ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తిని ఆక్షేపించారు. బుజ్జగింపు రాజకీయాలంటే తనకు ఇష్టముండదని….ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ముఖాముఖిలో వివేక్‌ రామస్వామి స్పష్టం చేశారు. అమెరికన్లతో మమేకం కావాల్సిన అవసరం ఉందన్నారు. పుతిన్‌ దుష్టనియంత అంటే…. ఉక్రెయిన్‌ మంచిదని కాదన్నారు.

11 ప్రతిపక్ష పార్టీలను నిషేధించటంతోపాటు అన్నిమీడియాలను కలిపి ఒకే అధికార మీడియాగా మార్చిన దేశమని వివేక్‌ రామస్వామి ఆరోపించారు. అమెరికా నుంచి నిధులు అందితే తప్ప ఉక్రెయిన్‌లో సాధారణ ఎన్నికలు నిర్వహించలేమని అమెరికాను బెదిరించినట్లు పేర్కొన్నారు. టిక్‌టాక్‌ యాప్‌లో చేరటాన్ని సమర్థించుకున్న వివేక్‌ రామస్వామి….  అమెరికాకు చెందిన వచ్చేతరాన్ని చేరుకోవటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news