అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌.. ఈ టీవీలపై 60 శాతం డిస్కౌంట్‌

-

పండగ వచ్చిందంటే.. ఇంతక ముందు చుట్టాలు వచ్చేవాళ్లు.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆఫర్లు వస్తున్నాయి. పండగకు వారం ముందే ఆఫర్ల మొదలైపోతాయి. ఏదైనా వస్తువు కొనాలంటే.. దగ్గర్లో ఏం ఫెస్టివల్‌ ఉంది..ఆఫర్లు పెడుతున్నారా అని చూస్తున్నాం. దసరా పండుగ నేపథ్యంలో బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌, గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరుతో అమెజాన్‌ ప్రత్యేక ఆఫర్‌ సేల్స్‌ ప్రారంభించున్నాయి. అక్టోబర్‌ 8 నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. ఈ సేల్‌ అక్టోబర్‌ 15 వరకూ ఉంటుంది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో స్మార్ట్‌ టీవీలపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా దసరా పండుగ సీజన్‌ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2023కు సన్నద్ధమవుతోంది. అక్టోబర్ 8 తేదీ నుంచి అమెజాన్‌ ఆఫర్లు ప్రారంభం కానున్నాయి. ఈ సేల్‌లో భాగంగా ఓలెడ్, క్యూలెడ్ అండ్ 4కే డిస్ ప్లే గల శాంసంగ్, వన్ ప్లస్, సోనీ, ఎల్‌జీ, షియోమీ బ్రాండ్ల స్మార్ట్ టీవీల ధరలపై 60 శాతం వరకూ డిస్కౌంట్ అందిస్తోంది.

ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో జరిపే లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా షాపుల యాజమాన్యాలు కూపన్-బేస్డ్ డిస్కౌంట్లు, పేమెంట్ బేస్డ్ ఆఫర్లు కూడా ఉంటాయి. అలాగే.. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేసిన వారికి క్యాష్ బ్యాక్ ఆఫర్ తోపాటు వెల్ కం రివార్డు పాయింట్లు లభ్యమవుతాయి.

టీవీలపై ఉన్న ఆఫర్లు ఇవే..

రెడ్‌మీ 43- అంగుళాల 4కే ఆల్ట్రా హెచ్‌డీ టీవీ – రూ.42,999 నుంచి రూ.20,499లకు తగ్గింపు.. అదనంగా రూ.5000 లోపు ఎక్స్చేంజ్ ఆఫర్ డిస్కౌంట్.

వన్ ప్లస్ టీవీ 43 వై1 ఎస్ ప్రో రూ.39,999 నుంచి రూ.26,999లకు తగ్గింపు. ఎల్ఈడీ ఆండ్రాయిడ్ టీవీపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు లభ్యం.

ఎల్‌జీ 50 అంగుళాల 4కే ఆల్ట్రా హెచ్‌డీ టీవీ- రూ.60,990 నుంచి రూ.40,990కి తగ్గింపు. అదనంగా రూ.1000 వరకూ కూపన్ బేస్డ్ డిస్కౌంట్.

టీసీఎల్ 40-అంగుళాల ఎస్ సిరీస్ టీవీ రూ.40,990 నుంచి రూ.16,990లకు లభ్యం.

శాంసంగ్ క్రిస్టల్ 4కే ఐ-స్మార్ట్ యూహెచ్‌డీ టీవీ రూ.52,900 నుంచి రూ.32,990కి తగ్గింపు. కూపన్ బేస్డ్ డిస్కౌంట్ రూ.1000 అదనం.

ఎసెర్ 50-అంగుళాల వీ సిరీస్ 4కే ఆల్ట్రా హెచ్‌డీ క్యూలెడ్ టీవీ రూ.59,999 నుంచి రూ.32,499కి తగ్గింపు.

సోనీ బ్రేవియా 65-అంగుళాల 4కే ఆల్ట్రా హెచ్‌డీ టీవీ రూ.1,39,900 నుంచి రూ.82,990కి తగ్గింపు.

Read more RELATED
Recommended to you

Latest news