యుద్దం పరిష్కారం కాదు.. పుతిన్ కి ప్రధాని మోడీ సందేశం

-

రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ ఉబెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. యుద్ధం పరిష్కారం కాదని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. మంగళవారం మాస్కోలో ఇరు నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ యుద్ధంపై ఓపెన్ మైండ్లో చర్చించడం నాకు సంతోషంగా ఉంది, యుద్ధంపై ఒకరి ఆలోచనలను మరొకరం గౌరవంగా విన్నాము అని అన్నారు. యుద్ధం పరిష్కారం కాదని, శాంతికి భారత్ అనుకూలమని ప్రధాని పునరుద్ఘాటించారు. “శాంతి పునరుద్ధరణ కోసం అన్ని విధాల సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, నేను మీకు ప్రపంచ సమాజానికి భారతదేశం అనుకూలంగా ఉంటుందని హమీ ఇస్తున్నాను.” అని మోడీ పుతిన్ తో చెప్పారు.

ప్రపంచం ముందు ఇంధనం యొక్క సవాలు ఉందని, ఇలాంటి సమయంలో మీ సహకారంతో మేము పెట్రోల్-డీజిల్కి సంబంధించి ఇబ్బందుల నుంచి సామన్య ప్రజల్ని రక్షించామని, భారత్-రష్యా మధ్య ఇంధనానికి సంబంధించిన ఒప్పందం పరోక్షంగా ప్రపంచ మార్కెట్ స్థిరత్వాన్ని అందించిందని, దీనిని ప్రపంచం అంగీకరించాలని ప్రధాని అన్నారు. కోవిడ్, ప్రపంచ వ్యాప్తంగా సంఘర్షణలు కారణంగా ప్రపంచం ఆహారం-ఇంధనం-ఎరువుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, భారత్-రష్యా స్నేహం, సహకారం కారణంగా భారత రైతులు ఇబ్బందులు ఎదుర్కోలేని మోడీ కొనియాడారు. రైతులక ప్రయోజనాలకు మేం కట్టుబడి ఉన్నామని, రష్యా సహకారంతో మరింత ముందుకు సాగాలని ప్రధాని మోడీ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news