సామాజిక భద్రతా పథకం అటల్ పెన్షన్ యోజనలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేపట్టే అవకాశం ఉంది. ఈ పథకం కింద అందించే పెన్షన్ మొత్తాన్ని అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. గ్యారెంటీ పెన్షన్ మొత్తాన్ని రూ.5 వేలు నుంచి రూ.10 వేలకు పెంచాలని చూస్తోంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని అంచనా పెంచే వేస్తోందని సమాచారం. అటల్ పేన్షన్ యోజనను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు గ్యారెంటీగా ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపినట్లు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.
అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఎలాంటి పింఛను పథకాలకు నోచుకోని వారికోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని 2015 బడ్జెట్ లో ప్రకటించారు. నెలకు రూ.1000-5000 వరకు పెన్షన్ అందుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ఈ పథకంలో చేరొచ్చు. అందుకు అనుగుణంగా నెలనెలా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో 6.62 కోట మంది చేరారు. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 1.22 కోట్ల మంది ఈ పథకంలో చేరారు.