కరాచీలో ఆదివారం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ లో ప్రతిపక్ష పార్టీల కూటమి నేతృత్వంలోని ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగాయి. దీని కోసం వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. 11 పార్టీల ప్రతిపక్ష కూటమి పిడిఎం (పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్) చెందిన రెండో నిరసన ప్రదర్శన ఇది. మొదటిది లాహోర్ లోని గుజ్రాన్ వాలాలో జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో ప్రధాని వైఫల్యం చెందారు అనే ఆరోపణలు వచ్చాయి.
ఇమ్రాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేసారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) వైస్ ప్రెసిడెంట్ మరియం నవాజ్ ఆదివారం ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో మాట్లాడుతూ… కచ్చితంగా ఇమ్రాన్ ను జైలుకి పంప్సితా అని నా తండ్రిని తిరిగి అధికారంలోకి తీసుకొస్తా అని ప్రతిజ్ఞ చేసారు. ఆమె పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె.