ప్రస్తుత తరుణంలో ఒత్తిడి మన నిత్య జీవితంలో భాగం అయ్యింది. అనేక మంది నిత్యం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అసలే కరోనా కాలం. దీనికి తోడు ఇబ్బడిముబ్బడిగా ఉన్న ఆర్థిక సమస్యలు.. ఇతర కారణాల వల్ల అనేక మంది రోజూ స్ట్రెస్‌కు గురవుతున్నారు. ఫలితంగా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తోంది. అయితే నిత్యం ఎదురయ్యే ఒత్తిడి నుంచి బయట పడాలంటే అందుకు పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేమిటంటే…
* ఇష్టమైన సంగీతాన్ని వినడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చాలా తక్కువ శబ్దంతో నచ్చిన సంగీతాన్ని వింటే ఒత్తిడి మటుమాయమవుతుందని అంటున్నారు.
* ఇంట్లో ఆల్బమ్ లు లేదా ఫోన్లు, కంప్యూటర్లలో ఉండే పాత ఫొటోలు, వీడియోలను చూడాలి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపిన తీపి సంఘటనలను గుర్తు చేసుకోవాలి. దీంతో మనస్సు చాలా రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది.
* పచ్చని ప్రకృతి వాతావరణంలో గడపాలి. పక్షుల అరుపులతో కూడిన పార్కులు, ఇతర ప్రకృతి ప్రదేశాల్లో కొంత సేపు విహరించాలి. దీని వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది.
* ఫోన్లు లేదా కంప్యూటర్లలో కొంత సేపు వీడియో గేమ్‌లు ఆడడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆయా గేమ్‌లను అదే పనిగా ఆడితే ఆశించిన ఫలితం రాకపోగా దాంతో కొత్త సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది. కనుక ఆ గేమ్స్‌ను కొంత సేపు మాత్రమే ఆడాలి.
* ఔట్ డోర్ గేమ్స్ ఆడడం, మెదడుకు పని చెప్పే పజిల్స్ పూరించడం, మెడిటేషన్ చేయడం వంటి పనుల వల్ల కూడా ఒత్తిడిని ఇట్టే తగ్గించుకోవచ్చు.