ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిపై వేటు వేసిన జెలెన్​స్కీ

-

ఉక్రెయిన్-రష్యాల యుద్ధం కీలకదశలో ఉంది. ఈ యుద్ధంలో తమ సైనికులు, ప్రజల ప్రాణాలు, పలు భూభాగాలను కోల్పోయిన ఉక్రెయిన్ ఇప్పుడిప్పుడే ఎదురుదాడికి దిగుతోంది. రష్యాపై భీకరయుద్ధాన్ని చేస్తోంది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో కీలకమైన ఎదురుదాడి సమయంలో ఉక్రెయిన్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచాన్ని షాక్​కు గురి చేసింది.

తాజాగా ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌ని పదవి నుంచి తొలగించారు ఆ దేశాధ్యక్షుడు జెలెన్​స్కీ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ‘‘రక్షణ మంత్రిత్వ శాఖ సరికొత్త విధానాన్ని అనుసరిస్తుందని.. సమాజం, సైన్యం ఒక్కటిగా కలిసి పనిచేస్తారని నేను నమ్ముతున్నాను’’ అని జెలెన్​స్కీ పేర్కొన్నారు.

రష్యా యుద్ధం మొదలుపెట్టడానికి ముందు 2022లో రెజ్నికోవ్‌ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా రెజ్నికోవ్‌ స్థానంలో ఉక్రెయిన్‌ స్టేట్‌ ఫండ్‌ను నిర్వహిస్తున్న రెస్టెమ్‌ ఉమెరోవ్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. తాజాగా రెజ్నికోవ్‌ యూకేలో ఉక్రెయిన్‌ దౌత్యాధికారిగా బాధ్యతలు స్వీకరించవచ్చని ప్రచారం జరుగుతోంది. తనను పదవి నుంచి తప్పిస్తారని రెజ్నికోవ్‌కు ముందే సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news