కాశ్మీర్‌లో టెన్ష‌న్‌ టెన్షన్‌.. మాజీ సీఎంల గృహ నిర్బంధం.. ఇంటర్నెట్ బంద్‌

-

జమ్మూ కాశ్మీర్‌లో ఏం జరుగుతోంది.. కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కేంద్రం కీల‌క నిర్ణ‌యాలు తీసుకోబోతుంద‌నే విష‌యం చాలా స్ప‌ష్టంగా అర్దం అవుతోంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పి స్తున్న రాజ్యాంగ అధికరణాల రద్దు చేసి జమ్ము కాశ్మీర్‌ని మూడు రాష్ట్రలుగా విభజిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. గుంపులుగా తిరగడం నిషేదిస్తూ 144 సెక్షన్‌ అమలు చేశారు.

కేంద్ర కేబినెట్ సమావేశంలో కాశ్మీర్ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.గత కొన్ని రోజులుగా కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కాశ్మీర్‌లోని ఎన్ఐటికి సెలవులు ప్రకటించి.. విద్యార్థులను కూడా ఖాళీ చేయించింది కేంద్రం.అమర్‌నాథ్ యాత్ర ప్రయాణికులను కూడా వెనక్కి పంపించేసింది. ప్రస్తుతం కాశ్మీర్‌ లోయలో అడుగడుగునా భద్రతా బలాలను మోహరించారు. కాశ్మీర్‌ మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను ఆదివారం రాత్రి నుంచి గృహ నిర్బంధం చేశారు.


కాగా కేంద్ర ప్ర‌భుత్వం ఆర్టిక‌ల్ 370, ఆర్టిక‌ల్ 35ఎ ల‌ను ర‌ద్దు చేస్తే గ‌న‌క ఇక‌పై జ‌మ్మూ కాశ్మీర్ కూడా మ‌న దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లో ఒక‌టిగానే సాధార‌ణ రాష్ట్రంగానే ఉంటుంది. దానికి ఎలాంటి స్వ‌యం ప్ర‌తిప‌త్తి ఉండ‌దు. ఇక అక్క‌డి పౌరుల‌కు ఎలాంటి ప్రత్యేక హ‌క్కులూ ఉండ‌వు. అన్ని రాష్ట్రాల్లానే సాధార‌ణ రాష్ట్రంగానే జ‌మ్మూ కాశ్మీర్‌ను ప‌రిగ‌ణిస్తారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం ఈ రెండు ఆర్టిక‌ల్స్‌ను ర‌ద్దు చేసే నిర్ణ‌యం తీసుకుంటుందా.. లేక పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పీవోకే)ను స్వాధీనం చేసుకుంటామ‌ని ప్ర‌క‌టిస్తుందా.. అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది.

ఆర్టిక‌ల్ 370 , కాశ్మీర్‌కి ఏం సంబంధం..? ఎందుకు ఉద్రిక్త‌త‌లు..?

భార‌త్‌, పాక్‌ల మ‌ధ్య కాశ్మీర్ స‌మ‌స్య అస‌లు ఎలా ప్రారంభ‌మైంది..? వివ‌రంగా..!

 

Read more RELATED
Recommended to you

Latest news