శ్రీ నాగ నాధేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర విశేషాలు…!

-

మన భారతదేశంలో అనేక ప్రాచీన దేవాలయాలు ఉన్నా శైవ దేవాలయాలకు ఉన్న ప్రాముఖ్యత ఎక్కువ. వీటిలో కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలకు ఎంతో విశీష్టత ఉంది. ఆ దేవాలయాలను ఒక్కసారైనా దర్శించుకోవాలి. వాటిలో ముఖ్యమైన శ్రీ నాగ నాదేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం గురించి తెలుసుకుందాం.

మహారాష్ట్రలోని ప్రభాస రైల్వే స్టేషన్ కు దగ్గర్లో శ్రీ నాగ నాదేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఈ క్షేత్రాన్ని పాండవులు వనవాసం చేసే సమయంలో దారుకా వనంలో ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణ గాథ. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు హిందూ దేవాలయాలు అన్ని కూల్చి వేస్తున్న సమయంలో ఈ క్షేత్రం వద్దకు రాగానే శరీరం నిండా పాములు, చేతిలో త్రిశూలం పట్టుకున్న నగ్న కాపాలికులు ఔరంగజేబుని, అతని సేనలను తరిమి కొట్టినట్టు కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఇంకా ఇలాంటి నాగ నాదేశ్వర దేవాలయాలు మూడు చోట్ల ప్రసిద్ది చెందిన క్షేత్రాలుగా ఉన్నాయి. శివుని మెడలో ఉండే నాగరాజు యొక్క స్వరూపంగా ఈ ఆలయానికి పేరు. ఇక్కడి స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చి మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం.

Read more RELATED
Recommended to you

Exit mobile version