సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్‌కు ఇటీవలి కాలంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించడమే పెద్ద సవాల్‌గా మారుతోంది. యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు వస్తుండడంతో వాటిని పరిష్కరించడం యాపిల్‌కు ఇబ్బందిగా మారుతోంది. ఇక తాజాగా ఐఫోన్లు, ఐప్యాడ్లలో బ్యాటరీ సమస్యలు వస్తున్నాయని యూజర్లు పెద్ద ఎత్తున యాపిల్ ఫోరంలలో ఫిర్యాదులు చేస్తున్నారు.
యాపిల్ సంస్థ ఇటీవలే ఐఫోన్లకు ఐఓఎస్ 14.2, ఐప్యాడ్లకు ఐప్యాడ్ ఓఎస్ 14.2 అప్‌డేట్లను విడుదల చేసింది. అయితే ఈ అప్ డేట్లను ఇన్‌స్టాల్ చేసుకున్న పలువురు యూజర్లకు బ్యాటరీ సమస్యలు వస్తున్నాయి. బ్యాటరీ చాలా త్వరగా అయిపోతుందని వారు కంప్లెయింట్ చేస్తున్నారు. కేవలం 30 నిమిషాలు వాడితేనే 50 శాతం చార్జింగ్ అయిపోతుందని వారు ఫిర్యాదు చేస్తున్నారు.
ఇక ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ 7, 6ఎస్, ఐఫోన్ ఎస్ఈ మొదటి జనరేషన్ ఐఫోన్లతోపాటు 2018లో విడుదలైన ఐప్యాడ్ ప్రొలను వాడుతున్నవారికే ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. అయితే దీనిపై యాపిల్ ఇంకా స్పందించలేదు. కానీ త్వరలోనే ఐఓఎస్ 14.3 అప్ డేట్‌ను యాపిల్ విడుదల చేస్తుందని తెలుస్తోంది. అందులోనే ఈ సమస్యకు పరిష్కారం లభించవచ్చని భావిస్తున్నారు.