IPL 2022 AUCTION : స‌న్ రైజ‌ర్స్ లోకి చాహ‌ల్.. రూ. 10 కోట్లు!

-

ఐపీఎల్ 2022 కోసం ఈ నెల 12, 13 వ తేదీల‌లో మెగా వేలం జ‌ర‌గ‌నుంది. ఈ మెగా వేలానికి అన్ని ఫ్రొంచైంజ్ లు సిద్ధం అవుతున్నాయి. కాగ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కూడా మెగా వేలం కోసం స‌న్న‌ద్ధం అవుతుంది. అందు కోసం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌ను కూడా త‌యారు చేసుకుంది. కాగ ఈ మెగా వేలంలో టీమిండియా స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ పై స‌న్ రైజ‌ర్స్ క‌న్ను వేసింది. ఈ మెగా వేలంలో ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని స‌న్ రైజ‌ర్స్ యాజ‌మాన్యం ప్ర‌య‌త్నిస్తుంది.

చాహ‌ల్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు పెట్ట‌డానికైనా స‌న్ రైజ‌ర్స్ యాజ‌మాన్యం సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఇటీవ‌ల రిటెన్షన్ ప్ర‌క్రియ‌లో ఆఫ్ఘ‌నిస్థాన్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ స‌న్ రైజ‌ర్స్ వ‌దిలేసిన విషయం తెలిసిందే. అయితే ఆ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌గ‌ల స్పిన్న‌ర్ల వేట‌లో స‌న్ రైజ‌ర్స్ ప‌డింది. అందు కోసం రూ. 10 కోట్లు వెచ్చించ‌డానికీ సిద్ధంగా ఉందని స‌మాచారం. మెగా వేలంలో చాహ‌ల్ ద‌క్క‌క‌పోతే.. కుల్దీప్ యాద‌వ్ ను ద‌క్కించుకోవాల‌ని స‌న్ రైజ‌ర్స్ యాజ‌మాన్యం ప్ర‌య‌త్నిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news