ఐపీఎల్ 2024 :రచిన్ రవీంద్ర కోసం ఆ మూడు జట్లు పోటీ ?

-

ఈ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తరపున ఆల్ రౌండర్ గా ఆడుతున్న రచిన్ రవీంద్ర అంచనాలకు మించి రాణిస్తూ మ్యాచ్ విన్నర్ గా మారిపోయాడు అని చెప్పాలి, ఒకవైపు బంతితో మరియు బ్యాట్ తో రాణిస్తూ న్యూజిలాండ్ కు చాలా విలువైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రవీంద్ర 9 మ్యాచ్ లు ఆడగా 70 .62 సగటుతో 565 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మొదటి స్థానాన్ని అందుకున్నాడు. రవీంద్ర ఈ విధంగా రాణిస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. అందుకే ఇతనిపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాయి. యూఏఈ లో జరగనున్న వేలంలో ఇతన్ని దక్కించుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.

ముఖ్యంగా సీజన్ లు మారుతున్నా రాత మారని ఫ్రాంఛైజీలుగా ఉన్న సన్ రైజర్స్ హైద్రాబాద్, పంజాబ్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు లో ఇతన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫస్ట్ డౌన్ బ్యాట్స్మన్ గా మరియు బౌలర్ గా సరిగ్గా సూట్ అవుతాడని ఎందరో భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news