అంబలి, అన్నదానం చేస్తే.. చేసిన పాపాలు పోతాయా..? బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

అంబలి, అన్నదానం చేస్తే చేసిన పాపాలు పోతాయా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయురాలా ప్రభుత్వాలనే మార్చేసిన చరిత్ర మీరు అన్నారు. కేసీఆర్ అరాచక పాలన ఎట్లా ఉందో మీరు పడ్డ గోసను గుర్తు చేసుకోండని తెలిపారు. కేసీఆర్ పాలనను అంతం చేయండి. మీ కోసం కొట్లాడిన బీజేపీని గెలిపించండి. పొరపాటున మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే.. మూడు నెలలకొకసారి జీతాలు వస్తాయి. బదిలీలు, ప్రమోషన్లు రావనే విషయాన్ని గుర్తుంచుకోండి అని తెలిపారు.

తెలంగాణ తొలి ఓటరు ఉన్న నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్.. బీజేపీ తొలి విజయం కూడా ఇక్కడే అని ధీమా వ్యక్తం చేశారు. కోనప్పా ఇక చాలప్ప ఆంధ్రాకు వెళ్లిపో అప్పా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పాల్వాయి హరీశ్ రావు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. బహిరంగ సభకు వేలాది మంది తరిలివచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సమక్షంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news