మొదట బ్యాటింగ్ ఎంచుకోకపోవడం ఎంత తప్పో ఇప్పుడు డుప్లిసిస్ కు మరియు బెంగుళూరు టీం యాజమాన్యానికి తెలిసి ఉంటుంది. ఈ పిచ్ పైన సెకండ్ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం, ఇక్కడ ఎక్కువ విజయాల శాతం కూడా మొదటి బ్యాటింగ్ చేసిన జట్లకు ఉంది. కాగా ప్రస్తుతం టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయినా అవేమా పట్టనట్లు క్లాజెన్ క్రీజులోకి వచ్చి రావడంతోనే బౌండరీలతో బెంగుళూరు బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. నామమాత్రపు మ్యాచ్ కావడంతో ఎడాపెడా బంతిని బాదేస్తున్నాడు.. ఈ దశలో క్లాజెన్ కేవలం 21 బంతుల్లోనే అర్ద సెంచరీ సాధించి హైద్రాబాద్ ను భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నాడు.
ఇతనికి కెప్టెన్ మార్ క్రామ్ నుండి చక్కని సహకారం లభిస్తుండడంతో స్వేచ్ఛగా పరుగులు తీస్తున్నారు. వీళ్ళు ఇద్దరూ చివరి వరకు బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 200 పరుగులు ఖాయం.