గత వారమే పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ను కొన్ని అభియోగాల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ముఖ్య నగరాలలో నిరసన జ్వాలలు రేగాయి. కొన్ని చోట్ల అయితే పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయని చెప్పాలి. పిటిఐ నాయకుడు షా మహమ్మద్ ఖురేషీని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కాగా ఈ అరెస్ట్ పై ఇస్లామాబాద్ కోర్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షా మహమ్మద్ ఖురేషీని అక్రమంగా అరెస్ట్ చేశారని పాకిస్తాన్ ప్రభుత్వంపై హై కోర్ట్ ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఉన్నపళంగా షా ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే ఇందుకు పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పిన కారణం.. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో దేశంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతోంది. ఇప్పుడు ఖురేషీ సైతం ఇలాంటి చర్యలకు పాల్పడుతారనే అనుమానంతోనే అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.