ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ కింగ్స్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కీలక ఆటగాళ్లు ఫెయిల్ అయ్యారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సంజు శాంసన్ లక్కీ ఛాన్స్ కొట్టాడని చెప్పాలి. ఈ సీజన్ లో ఇదే చివరి మ్యాచ్ కావడం వలన రాజస్థాన్ మరియు పంజాబ్ లు ఇద్దరూ తప్పక గెలిస్తేనే ప్లే ఆఫ్ కు వెళ్లే ఛాన్సెస్ మెరుగుపరుచుకుంటాయి. కానీ ఇలాంటి కీలకమైన మ్యాచ్ లో చాలా సాధారణమైన ఆటతీరును కనబరిచి కేవలం 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి రాజస్థాన్ కు ఊపిరినిచ్చింది. ఈ సీజన్ లో సెంచరీ తో అదరగొట్టిన ఓపెనర్ ప్రభు సిమ్రాన్ సింగ్ (2) కష్టాల్లో జట్టును ఆదుకోకుండా ఫెయిల్ అయ్యాడు.
ఐపీఎల్ 2023 : పంజాబ్ కింగ్స్ పని అయిపోయినట్లే… 50 పరుగులకే 4 వికెట్లు !
-