ఐపీఎల్ 2023 : ఆర్సీబీ లక్నో “జంబో ప్లేయర్” ను అడ్డుకుంటుందా !

-

ఐపీఎల్ లో ఇంతవరకు ట్రోఫీని గెలవని జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీం చరిత్రలో నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న సీజన్ 16 లో భాగంగా రెండు మ్యాచ్ ల తర్వాత ఒకటి గెలిచి మరొకటి ఓడిపోయి తటస్థ స్థితిలో ఉంది. ఆర్సీబీ బలం అంతా తమ జట్టు ఓపెనర్లు డుప్లెసిస్ మరియు విరాట్ కోహ్లీ ల మీదనే ఉంది. వీరికి కనుక విఫలం అయితే టీం అంతా పేకమేడలా కూలిపోతోంది. ఇందుకు గత మ్యాచ్ ఉదాహరణ. కాగా ఈ రోజు మ్యాచ్ లో బ్యాటింగ్ మరియు బౌలింగ్ లో దుర్బేధ్యంగా ఉన్న లక్నో సూపర్ జయింట్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియమ్ బెంగుళూరు లో జరగనుంది.

కాగా ఇప్పటి వరకు లక్నో ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు గెలిచింది, వీటిలో రెండు మ్యాచ్ లలో బ్యాట్సమన్ ఆడిన తీరు ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ జట్టు జంబో ప్లేయర్ కైల్ మేయర్స్ పవర్ ప్లే లోనే మ్యాచ్ ను లాగేసుకుంటున్నాడు. బంతిని బలంగా బాదుతూ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాడు. మరి బెంగుళూరు ఇతన్ని ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news