బీసీసీఐ వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ కి కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నట్లు సమాచారం. అయితే మనకి ఐపీఎల్ అంటే పరుగుల వరద గుర్తొస్తుంది.ఈ నిబంధనలో బీసీసీఐ బౌలర్లకి ఒక కొత్త అస్త్రాన్ని ఇచ్చేలా కనిపిస్తుంది. ఈ నియమం ప్రకారం బ్యాటర్స్ కి మరింత పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ఇకపై బౌలర్లు ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లను వేయవచ్చు. గతంలో ఓవరికి ఒకే బౌన్సర్ని వేసుకునే అవకాశం ఉండేది. అలాగే అదే ఓవర్లో ఇంకో బౌన్సర్ వేస్తే దానిని వైడ్ గా ప్రకటించేవారు. బ్యాటర్ మరియు బౌలర్ మధ్య పోటీని పెంచే ఉద్దేశం తోనే ఈ నిబంధనను తీసుకు వస్తున్నట్లు సమాచారం. ఇదివరకే ఈ నిబంధనని సయ్యద్ ముస్తక్ ఆలీ టీ20 టోర్ని లో అమలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో బీసీసీఐ పై బౌలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా పేసర్ జయదేవ్ ఉనాద్కత్ మాట్లాడుతూ ఈ నియమం బౌలర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనివల్ల బ్యాటర్లకి బౌలర్లను ఎదుర్కోవడం మరింత కష్టతరం అవుతుందనిక్రికెట్ లో ఇది చిన్న మార్పు అయిన దీని యొక్క ప్రభావం చాలా మేరకు ఉండబోతుందని అన్నాడు. అలాగే ఇది బౌలర్లకి ఆయుధమని అన్నాడు.