ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య టుడే మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
78 రన్స్ కే 5 వికెట్లు కోల్పోయిన దశలో అనుజ్ రావత్ (48), దినేశ్ కార్తీక్ (38*) కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు.కోహ్లి (21), డుప్లెసిస్ (35), గ్రీన్ (18) పరుగులు చేయగా.. రజత్, మ్యాక్సీ డకౌట్ అయ్యారు. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ 4, దీపక్ చాహర్ 1 వికెట్ తీశారు. టీ20ల్లో 12000 రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ప్రపంచంలో ఆరవ బ్యాట్స్‌మెన్‌గానూ, ఇండియా నుంచి తొలి బ్యాట్స్‌మెన్‌గానూ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్ ఉన్నారు