IPL 2024 : ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు… పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా లో ఇవాళ పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటగా బ్యాటింగ్కు దిగినా సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 182/9 రన్స్ చేసింది. ఇక సన్రైజర్స్ ఓపెనర్లలో హెడ్ 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరో సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్ఖరం డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 16 పరుగులు చేసి సామ్ కరణ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన ఆల్రౌండర్, తెలుగు బిడ్డ నితీశ్ కుమార్ రెడ్డి చెలరేగి ఆడారు. పంజాబ్ బౌలర్ల ధాటికి పవర్ ప్లేలోనే పీకల్లోతు కష్టాల్లో పడిన హైదరాబాద్ను 64 పరుగులు ఆదుకున్నారు. మార్కమ్, క్లాసెన్, హెడ్, అభిషేక్ లాంటివారు విఫలమైన పిచ్పై నితీశ్ సిక్సులతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఔట్ అయ్యారు. అబ్దుల్ సామత్ 25 పరుగులతో రాణించాడు.ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీసి సన్ రైజర్స్ హైదరాబాద్ ను దెబ్బ కొట్టగా.. హర్షల్ పటేల్, కర్రన్ చెరో 2 వికెట్లు, రబడ ఒక వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news