మోహన్ లాల్ చాలా నుంచి పాఠాలు నేర్చుకున్నా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్

-

మలయాళ స్టార్ మోహన్లాల్ పై బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రశంసలు కురిపించారు. ఆయనతో కలిసి నటించిన ‘చక్రం’ సినిమా షూటింగ్లో చాలా జీవిత పాఠాలను నేర్చుకున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ మోహన్ లాల్ గొప్ప వ్యక్తి. షూటింగ్ గ్యాప్లోనూ సినిమా గురించే ఆలోచిస్తారు. సిబ్బందితో కలిసి సెట్లో చిన్న పనులు చేసేందుకూ వెనుకాడరు.

పుస్తకాలు చదవడం, ఇతరులతో మాట్లాడడం వంటివి చేస్తే పనిపై శ్రద్ధ పోతుందని భావించేవారు. డైరెక్టర్ షాట్‌కు ఎప్పుడు పిలిచినా వెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు అని తెలిపారు. ఆయనకు సినిమాపై ఉండే అంకితభావం చూసి నేను స్ఫూర్తి పొందాను అని అన్నారు. సినిమా బాగా రావాలని ఆయనపడే తపన నన్ను నిజంగా ప్రేరేపించింది. వ్యక్తిగతంగా ఎదగడం కంటే టీమ్‌గా ముందుకు సాగడం మరింత ముఖ్యమని ఆ సమయంలో అర్థం చేసుకున్నా’ అని తెలిపారు. కాగా, ఆమె మోహన్‌లాల్‌తో కలిసి నటించిన ‘చక్రం’ కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news